- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: విచారణకు రాలేను.. సీబీఐకు అవినాశ్ రెడ్డి లేఖ
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ రాశారు...

X
దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను విచారణకు హాజరుకాలేనని తెలిపారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు మరోసారి కూడా విచారించాలని భావించారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో మంగళవారం (రేపు) నాటి విచారణ నుంచి తనను మినహాయించాలని అవినాశ్ రెడ్డి కోరాడు. అయితే అవినాశ్ రెడ్డి అభ్యర్థనపై సీబీఐ అధికారులు స్పందించలేదు.. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు అవినాశ్ రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది. మరి సీబీఐ అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Read more:
వివేకా హత్య గురించి అతడికి ముందే తెలుసు: YS సునీత ఇంప్లీడ్ పిటిషన్‌లో కీలక అంశాలు
Next Story






