- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాకినాడలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుపై జయప్రకాష్ నారాయణ ప్రశంసలు
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా సముదాయం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ కో సంస్థకు లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా సముదాయం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ కో సంస్థకు లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు సంవత్సరానికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా (1.5 MTPA GNH3) ఉత్పత్తి సామర్థ్యంతో పాటు 1950 మెగావాట్ల ఎలక్ట్రో లైజర్ సామర్థ్యాన్ని కలిగి ఉండటం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఇది భారతదేశం శక్తి మార్పిడి (ఎనర్జీ ట్రాన్సిషన్) దిశగా సాగుతున్న ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
అధిక విలువ గల రసాయనాల ఉత్పత్తికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని, ఇలాంటి విస్తృత లక్ష్యాలు మరియు భారీ స్థాయి పెట్టుబడులే దేశ ఆర్థిక వ్యవస్థను రూపాంతరం చేయగలవని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు మరిన్ని ఇలాంటి ఆవిష్కరణలు, పెట్టుబడులు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
Read More..






