- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారనున్న ఏపీ.

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడలో సిద్ధమవుతున్న గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ (Green Ammonia Project) కార్యక్రమంపై సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2024 అక్టోబరులో ఏపీ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం ప్రారంభించేటప్పుడు తమ లక్ష్యాన్ని తెలిపామన్నారు. ఏపీని భారత గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న ప్రాజెక్ట్ మైలురాయిగా నిలుస్తుందన్నారు. తద్వారా గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారే దిశలో మరో కీలక అడుగు ఏపీ ముందుకు వేసిందన్నారు. ఇప్పటికే కాకినాడ ఉత్పత్తులు జర్మనీతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టు యంత్రాల స్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను పవన్ పాల్గొంటున్నామని తెలిపారు.
మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలు
భారతదేశం గ్లోబల్ క్లీన్ ఎనర్జీ నాయకత్వానికి వేసిన పునాదిని ఏపీ ముందుండి నడిపిస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇంధన దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు స్వచ్ఛ ఇంధన ఎగుమతిదారుగా మారుతోందని తెలిపారు. ఏపీ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం - 2024 ఈ దృక్పథానికి శ్రీకారం చుట్టిందని.. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ద్వారా ఎనర్జీ వాల్యూ చైన్ సమగ్ర అభివృద్ధి జరుగుతోందని వివరించారు. ప్రపంచ స్వచ్ఛ ఇంధన ఎగుమతి కేంద్రంగా భారత్ ను నిలిపేందుకు కీలక అడుగుపడిందని ప్రకటించారు.
Read More..






