- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్ష వీణపై దాడి.. పోలీసు విచారణలో జనసేన నాయకుడు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై కేసులో నిందితుడు తాతంశెట్టిని డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపట్టారు.

దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర(Railway Kodur Jana Sena leader Tathamsetty Nagendra)పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(Sc St Atrocity Case) నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడు తాతంశెట్టిని డీఎస్పీ శ్రీనివాసులు(Dsp Srinivasulu) ఆధ్వర్యంలో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపట్టారు. వివిధ రకాలుగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. హర్ష వీణపై దాడి చేయడానికి ‘‘కారణాలేంటి..?. ఎవరు చేయమన్నారు. ఎందుకు చేయాల్సి వచ్చింది..?’’ అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.
తనను మోసం చేశారంటూ..
కాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Railway Kodur MLA Arava Sridhar) తనను మోసం చేశారంటూ అదే ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని హర్ష వీణ కొంతకాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ రైల్వే కోడూరులోని రోడ్డుపై బైఠాయించి హర్ష వీణ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆమెపై జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర కర్రతో దాడి చేశారు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాతంశెట్టిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.






