- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చూస్తూ ఊరుకోను.. తిరగబడతా..?: ఎమ్మెల్యే బొజ్జలకు వినుత కోట వార్నింగ్
జనసైనికులపై పడితే చూస్తూ ఊరుకోనని, తిరగబడతానని శ్రీశైలం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోట వార్నింగ్ ఇచ్చారు. ..

దిశ, వెబ్ డెస్క్: జనసైనికులపై పడితే చూస్తూ ఊరుకోనని, తిరగబడతానని శ్రీశైలం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి(Srisailam MLA Bojjala Sudheer Reddy)కి జనసేన పార్టీ ఇంచార్జి వినుత కోట(Janasena Party In-charge Vinutha Kota) వార్నింగ్ ఇచ్చారు. అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు జనసేన కార్యకర్త శివ కుమార్ ఇంటిని కూల్చి వేశారు. ఈ కూల్చివేత ప్రాంతాన్ని వినుత కోట పరిశీలించి బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎవడబ్బ సొమ్మని జనసైనికుల మీదకు వస్తున్నావ్..? అంటూ మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని టెర్రరిస్టుల మాదిరిగా ట్రీట్ చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ల్యాండ్‌లో వాళ్లు ఇల్లు కట్టుకుంటే తమ దౌర్జన్యమేంటి అని వ్యాఖ్యానించారు. తమరేదైనా చేయాలనుకుంటే నోటీసులు ఇచ్చి అఫీషియల్‌గా చేయాలన్నారు. జనసేనను తొక్కాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను చూసి ఊరుకుంటున్నానని.. తిరగబడితే సుధీర్‌రెడ్డికే నష్టమని హెచ్చరించారు. గత ఐదు సంవత్సరాలు సుధీర్‌రెడ్డి గోవా, ముంబైలో పబ్బుల్లో ఉన్నారని, కష్టం తాముపడితే.. చివరి నిమిషంలో వచ్చి ఎమ్మెల్యే సీటును కొట్టుకుపోయారని వినుత కోట ఆరోపించారు.






