నా వల్ల పవన్ కల్యాణ్‌కు ఇబ్బంది కావొద్దనే తప్పుకున్నా.. జనసేన నేత క్లారిటీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-07 14:59:02  IST  )

జనసేన పార్టీకి రాజీనామా చేసినట్లు వస్తోన్న వార్తలపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు.

నా వల్ల పవన్ కల్యాణ్‌కు ఇబ్బంది కావొద్దనే తప్పుకున్నా.. జనసేన నేత క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీకి రాజీనామా చేసినట్లు వస్తోన్న వార్తలపై బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetty Satyanarayana) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు. పదవి నుంచి మాత్రమే వైదొలిగా. నేను పర్యావరణానికి సబంధించిన కేసు వేశాను. నా వల్ల పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)కు ఇబ్బంది కలగకూడదనే దూరంగా ఉన్నా. పరిశ్రమల కాలుష్యంతో పర్యావరణం తీవ్రంగా నష్టపోతోంది. ఉత్తర కోస్తా, కాకినాడ ప్రాంతాలపై తీవ్రప్రభావం ఉంది. సముద్ర జీవవైవిధ్యం ధ్వంసమవుతోంది. కాలుష్య నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ వివరణ ఇచ్చారు.

ఎల్లప్పుడూ పవన్ కల్యాణ్‌ వెంటే

తాను కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే రాజీనామా చేశానని.. జనసేన పార్టీకీ కాదంటూ చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది స్వార్థంతో దీనిని తప్పుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. తాను ఎల్లప్పుడూ పవన్ కల్యాణ్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఏ పార్టీలో అయినా కార్యకర్తలకు పార్టీ నుంచి ఆర్థిక సాయం వస్తుందని.. జనసైనికులు మాత్రం తమ సొంత డబ్బుతో జనసేన జెండాను మోస్తున్నారని అన్నారు. జనసేనతో తన బంధం రాజకీయాలకు అతీతమైనదని.. ఒక సిద్ధాంతం కోసం తాను కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే రాజీనామా చేశాను. దానిని కొందరు స్వార్ధంతో తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు.

జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు: బొలిశెట్టి ట్విస్ట్

Next Story