జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు: బొలిశెట్టి ట్విస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-07 14:57:51  IST  )

జనసేనకు తాను రాజీనామా చేయలేదని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు..

జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు: బొలిశెట్టి ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీకి తాను రాజీనామా చేయలేదని, పదవి నుంచి మాత్రమే వైదొలిగానని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. తాను పర్యావరణానికి సంబంధించిన కేసు వేశానని, తన వల్ల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఇబ్బంది కలగకూడదనే ఆ పార్టీ పదవులకు దూరంగా ఉన్నానని ఆయన స్పష్టంచేశారు. పరిశ్రమల కాలుష్యంతో పర్యావరణం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర కోస్తా, కాకినాడ ప్రాంతాలపై కాలుష్యం తీవ్రప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల సముద్ర జీవవైవిధ్యం ధ్వంసమవుతోందని తెలిపారు. కాలుష్య నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

నా వల్ల పవన్ కల్యాణ్‌కు ఇబ్బంది కావొద్దనే తప్పుకున్నా.. జనసేన నేత క్లారిటీ

Next Story