AI సమ్మిట్‌లో యువ కాంగ్రెస్ వ్యవహారం సిగ్గుచేటు: మాజీ సీఎం జగన్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-21 13:19:05  IST  )

ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్ నిరసన తెలపడంపై ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్ మనందరినీ సిగ్గుపడేలా చేసిందని పేర్కొన్నారు.

AI సమ్మిట్‌లో యువ కాంగ్రెస్ వ్యవహారం సిగ్గుచేటు: మాజీ సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్ నిరసన తెలపడంపై ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్ మనందరినీ సిగ్గుపడేలా చేసిందని పేర్కొన్నారు. మన రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయని ప్రశ్నించారు. ఎవరూ మన దేశాన్ని కించపర్చకూడదని, రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ ప్రపంచం ముందు ఐకమత్యం ప్రదర్శించాలని తెలిపారు. కాగా జగన్ ట్వీట్ కు టీడీపీ సోషల్ మీడియా కౌంటర్ ఇస్తోంది.

మరి సొంతరాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై, వ‌స్తున్న కంపెనీల‌పై ఎందుకు అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తోంది. జ‌గ‌న్ కు ష‌ర్మిల భ‌యం ప‌ట్టుకుంద‌ని.. మోడీ అపాయింట్మెంట్ దొర‌క‌డం లేద‌ని కామెంట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఏఐ స‌మ్మిట్ ఏఐ స‌మ్మిట్ లో యూత్ కాంగ్రెస్ ఆందోళ‌న చేప‌ట్ట‌డం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌పంచ దిగ్గ‌జాలు వ‌చ్చే స‌మ్మిట్ లో అలా ప్ర‌వ‌ర్తించ‌డం ఏంట‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు కాంగ్రెస్ నిర‌స‌న‌కు వ్య‌తిరేకంగా నేడు బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆందోళ‌న‌లు చేప‌డుతోంది.

మీ తండ్రి వారసత్వాన్ని దిగజార్చకండి! మాజీ సీఎం జగన్ ట్వీట్‌పై ఐవైసీ ఘాటు కౌంటర్

Next Story