- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ తండ్రి వారసత్వాన్ని దిగజార్చకండి! మాజీ సీఎం జగన్ ట్వీట్‌పై ఐవైసీ ఘాటు కౌంటర్
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలకు ఐవైసీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా బదులిచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 'ఏఐ ఇంపాక్ట్ సమిట్'లో భారత యువజన కాంగ్రెస్ (ఐవైసీ) కార్యకర్తలు చేసిన నిరసనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు ఐవైసీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా బదులిచ్చింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఢిల్లీలోని సమిట్ ఎగ్జిబిషన్ హాలు నంబరు-5లోకి ప్రవేశించిన సుమారు 15 మంది ఐవైసీ కార్యకర్తలు అకస్మాత్తుగా చొక్కాలు విప్పి ఆందోళనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోడీకి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న టీ-షర్ట్‌లను ప్రదర్శించారు. ఈ నాటకీయ పరిణామాన్ని బీజేపీతో పాటు బీఆర్ఎస్, బీఎస్పీ, వైసీపీ తదితర పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి.
జగన్ ట్వీట్..
ఈ నిరసన ఘటనపై శనివారం స్పందించిన మాజీ సీఎం జగన్.. కాంగ్రెస్ శ్రేణుల తీరును తప్పుబట్టారు. ‘నిన్న ఏఐ సమిట్‌లో యువజన కాంగ్రెస్ వ్యవహరించిన తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసింది. అసలు మన రాజకీయాలు ఎటు పోతున్నాయి! దేశ ప్రతిష్టను ఎవరూ ఇలా దిగజార్చకూడదు. మన మధ్య రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ప్రపంచం ముందు మనమంతా ఐకమత్యంగానే నిలబడాలి’ అని జగన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఐవైసీ ఘాటు కౌంటర్..
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) వెంటనే స్పందిస్తూ.. దివంగత సీఎం వైఎస్సార్‌ను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చింది. ‘ప్రియమైన జగన్.. మాకు గర్వకారణమైన నాయకుడు, మీ తండ్రిగారైన దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) తన జీవితాంతం మతతత్వ, విభజన శక్తులపైనే పోరాడారు. మీరు సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు.. కానీ, కనీసం మీ తండ్రి వారసత్వాన్ని ఇంత బాహాటంగా దిగజార్చకండి’ అని ఐవైసీ తన ట్వీట్‌లో బదులిచ్చింది.






