Breaking: స్టీల్ ప్లాంట్‌ డంప్ యార్డులో భారీ పేలుడు.. కార్మికులు పరుగులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-12 08:14:17  IST  )

స్టీల్ ప్లాంట్‌ డంప్ యార్డులో భారీ పేలుడు సంభవించింది....

Breaking: స్టీల్ ప్లాంట్‌ డంప్ యార్డులో భారీ పేలుడు.. కార్మికులు పరుగులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ (Visakha) స్టీల్ ప్లాంట్‌ (Steel Plant)లో పేలుడు సంభవించింది. డంప్ యార్డులో భారీ శబ్ధంతో మంటలు(Fire) చెలరేగాయి. దీంతో కంపెనీలోని కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే పరిశ్రమ సిబ్బంది స్థానిక ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ మధ్య కాలంలో ప్లాంట్ లో అగ్నిప్రమాదాలు జరగడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలతో కార్మికులు మృతి చెండడం, గాయాలపాలు కావడం వంటివి జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్లాంట్‌లో పటిష్టమైన సేఫ్టీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Read More... మా ఆదేశాలంటే లెక్క లేదా.. బుక్ మై షోపై హైకోర్టు సీరియస్

మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ప్రమాద స్థలానికి బయలుదేరిన హోంమంత్రి అనిత

Next Story