AP Govt:‘తల్లికి వందనం’ అర్హతలివే.. అప్లికేషన్ ఎలా చేయాలంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-12 09:33:11  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది.

AP Govt:‘తల్లికి వందనం’ అర్హతలివే..  అప్లికేషన్ ఎలా చేయాలంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు ఇవాళ(జూన్ 12) తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే, అంతమందికీ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ..జీవో నెం.27ను పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తల్లికి వందనం పథకం కోసం లబ్ధిదారులకు కావాల్సిన పత్రాలు, ఈ పథకం కింద ప్రయోజనం పొందే తల్లులు.. తప్పనిసరిగా కొన్ని పత్రాలు కలిగివుండాలి. అవే ఏంటో తెలుసుకుందాం..

తల్లికి వందనం అర్హతలివే!

1. దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శాశ్వత నివాసిగా ఉండాలి.

2. కుటుంబ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి.

3. నమోదు చేసుకోని తల్లులు, పిల్లలూ వెంటనే గృహ డేటాబేస్‌ (household databases)లలో నమోదు చేసుకోవాలి.

4. ఇంట్లోని తల్లులు తమ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి కచ్చితంగా E-KYC పూర్తి చేసి ఉండాలి.

5. బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. NPCIతో లింక్ చేసి ఉండాలి.

6. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు అర్హులు,

7.కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12 వేల లోపు ఉండాలి.

8.ఫ్యామిలీకి 3 ఎకరాల్లోపు మాగాణి, లేదా 10 ఎకరాల్లో పొడి భూమి, లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి.

9.విద్యార్థుల హాజరు శాతం 75 శాతం ఉండాలి.

ఈ పథకం అప్లికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్..

1. ఆధార్ కార్డు(తల్లి, పిల్లల ఆధార్ కార్డులు)

2. నివాస ధృవీకరణ పత్రం(రేషన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు)

3. ఆదాయ ధృవీకరణ పత్రం

4. పిల్లల జన్మ ధ్రువీకరణ పత్రం

5. తల్లి యొక్క బ్యాంకు ఖాతా వివరాలు (పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చెక్)

6.విద్యార్థి స్టడీ సర్టిఫికెట్

ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ..

ఆఫ్‌లైన్‌ పద్ధతిలో తల్లికి వందనం పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫారమ్‌ సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత.. అధికారులు ధృవీకరణ ప్రక్రియను నిర్వహిస్తారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత, ఆర్థిక సహాయం నేరుగా దరఖాస్తుదారు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/json_62025/1749714638695.pdf

Read More..

మహిళలకు తీపికబురు.. ‘తల్లికి వందనం’ పథకం జీవో విడుదల

Next Story