- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు తీపికబురు.. ‘తల్లికి వందనం’ పథకం జీవో విడుదల

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు కూటమి మరో తీపి కబురు చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు ఇవాళ ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకానికి నిధులు మంజూరు చేస్తూ జీవో నెం.27ను పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ (Kona Sasidhar) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామంతో రాష్ట్రంలో ఉన్న 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో 67,27,164 మంది విద్యార్థులకు గాను రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. అదేవిధంగా రూ.15 వేలల్లో రూ.2 వేలను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం పాఠశాలల మెయిన్‌టెనెన్స్‌తో, మరమ్మతు పనులు, తాగు నీరు, పారిశుధ్య నిర్వహణకు వినియోగించాని జీవో స్పష్టంగా తెలిపారు. తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read More..






