తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ నిధి అగర్వాల్

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-08 07:02:02  IST  )

కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు.

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ నిధి అగర్వాల్
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారు. సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ తరుణంలో ఇవాళ(ఆదివారం) తిరుమల శ్రీవారిని సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో నిధి అగర్వాల్ భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. ఇదిలా ఉండగా, ఆలయంలో నిధి అగర్వాల్‌ను చూసిన భక్తులు, అభిమానులు ఆమెతో సెల్ఫీ ఆసక్తి చూపారు.

బాక్సాఫీస్ వద్ద మీనాక్షి చౌదరీ ఊచకోత.. గోల్డెన్ చాన్స్ కొట్టేసిందిగా!

Next Story