- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cyclone Montha: ఈ ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోండి..?
రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావంతో పలుచోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మొంథా తుపాను(Cyclone Montha) ప్రభావంతో పలుచోట్ల భారీగా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కోస్తా(Kostha)లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ, కాకినాడ, విశాఖ, చీరాల, బాపట్ల వంటి తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పునరావాసాలకు తరలించారు.
ప్రస్తుతం తుఫాను ప్రభావంతో రాష్ట్రమంతా ముసురుకమ్ముకుంది. చల్లటి గాలులు వీస్తున్నారు. దీంతో ప్రజలకు అధికారులు పలు జాగ్రత్తలు సూచంచారు. తుపాను తర్వాత వేడిచేసిన, క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలని చెప్పారు. అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దన్నారు. షెల్టర్, ఆశ్రయంలో ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్ళవద్దని తెలిపారు. విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు, తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న, పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దని చెప్పారు. దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను, వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు.
READ MORE .....






