- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డేంజర్ జోన్లో మంగళగిరి.. పునరావాసాలకు ప్రజల తరలింపు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఏపీలో పలు చోట్ల భారీగా వర్షాలు పడుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఏపీలో పలు చోట్ల భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలపైనా వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు కృష్ణానదిలో వరద ఉధృతిగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో కృష్ణా నదికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పడిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. చాలా కాలనీల్లో ఇళ్లు నీటమునిగాయి.
మంగళగిరి లోతట్టు ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు మోకాల్లోతులో నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కృష్ణా నదిలో నీటి ప్రవాహం భారీగా పెరగడంతో మంగళగిరి లోతట్టు ప్రాంతాలకు అప్రమత్తత జారీ చేశారు. పునరావాసాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.






