- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rain Alert:కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఏపీలో మరో రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. గత వారం రోజుల నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో మరో రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
అయితే.. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు(గురువారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో ఈ రోజు నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
ఈ రోజు(గురువారం) అల్లూరి, కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అలాగే.. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది.
Read More..






