అర్ధరాత్రి నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

by Malleboina Mahesh |

రుతుపవనాలు, వాతావరణ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

అర్ధరాత్రి నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: రుతుపవనాలు, వాతావరణ ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ లు జారీ చేసింది. ఈ మేరకు వర్షాలు కూడా విస్తారంగా కురిశాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొదట మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 12 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

అనంతరం సాయంత్రం వరకు విరామం ఇచ్చి.. రాత్రి 10 గంటల తర్వాత నగర వ్యాప్తంగా వర్షం కుమ్మేసింది. దాదాపు 5 గంటల పాటు కంటిన్యూ వర్షం కురవడంతో.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. అలాగే తెల్లవారుజామున ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే జీహెచ్ఎమ్‌సీ, హైడ్రా, ఇతర రెస్క్యూ సిబ్బంది (Rescue personnel) ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story