Mangalagiri: దర్శకుడు Ram Gopal Varmaపై పోలీసులకు ఫిర్యాదు..

by Disha Web Desk 16 |
Mangalagiri: దర్శకుడు Ram Gopal Varmaపై పోలీసులకు ఫిర్యాదు..
X

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మంగళగిరి రూరల్ పోలీసులకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ వేదికగా ఏపీ వాలంటీర్లను రామ్ గోపాల్ వర్మ రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళగిరి క్రిష్టాయపాలెంకు చెందిన గంగాధర్ రాసిన రిజిస్టర్ పోస్టు ఫిర్యాదును పోలీసులు అందుకున్నారు. గంగాధర్ ఫిర్యాదును పరిశీలిస్తున్నారు.

అయితే వాలంటీర్లపై జననేన అధినేత చేసిన కామెంట్లపై దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీలో వాలంటీర్ల ఆత్మభిమానాన్ని కించపర్చారని పవన్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆర్జీవీ చేసిన ట్వీట్‌పై దుమారం రేగింది. దీంతో ఆర్జీవీపై గంగాధర్ ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను రెచ్చగొడుతున్నారని, ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని రిజిస్టర్ పోస్టులో మంగళగిరి పోలీసులను గంగాధర్ కోరారు. ప్రస్తుతం ఈ రిజిస్టర్ పోస్టు పోలీసులకు చేరింది. దీనిపై పోలీసుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్ అయిన భర్త.. మోసం చేశాడంటూ Sunny Leone పోస్ట్..



Next Story

Most Viewed