ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అసలు మనిషేనా..?: YS Jagan

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-28 12:54:06  IST  )

కూటమి నేతలు, ప్రజా ప్రతినిధుల బరితెగింపునకు అడ్డు లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ జగన్ అన్నారు...

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అసలు మనిషేనా..?: YS Jagan
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి నేతలు, ప్రజా ప్రతినిధుల బరితెగింపునకు అడ్డు లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడి తనం ఊహించని స్థాయికి వెళ్లిపోయిందని మండిపడ్డారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అసలు మనిషేనా? అని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే ఏ చర్యా లేదని మండిపడ్డారు. ఆముదాలవలస అమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులు భరించ లేక ఒక స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆత్మహత్యాయత్నం చేసినా ఏ చర్య లేదని ఆరోపించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసినా చివరకు కేసును క్లోజ్‌ చేయించుకున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి సంధ్యారాణి పీఏపైనా ఆరోపణలు

‘‘ మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ, తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే.. అతణ్ని అరెస్టు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌ ఫోన్‌లో ఒక మహిళతో మాట్లాడుతూ, అశ్లీలంగా ప్రవర్తించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అశ్లీల రికార్డింగ్‌ డ్యాన్సులు వేశారు. స్టేజీపై డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశారు. అలా రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడి తనం కనిపిస్తోంది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే, జైల్లో పెట్టాల్సింది పోయి, వారిని ప్రోత్సహిస్తున్నారు.’’ అని జగన్ మండిపడ్డారు.

Similar News : ఎమ్మెల్యే రాసలీలపై భగ్గుమన్న రోజా.. డిమాండ్ ఇదే..!

Next Story