ఎమ్మెల్యే రాసలీలపై భగ్గుమన్న రోజా.. డిమాండ్ ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-28 12:35:48  IST  )

రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఎమ్మెల్యే రాసలీలపై భగ్గుమన్న రోజా.. డిమాండ్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌(Railway Kodur Jana Sena MLA Sridhar)పై ప్రభుత్వ ఉద్యోగిని వీణ లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా(Former Minister Rk Roja), టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy), ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఆందోళన వ్యక్తం చేశారు.నగరి ఏ.జె.ఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. కీచక ఎమ్మెల్యేలను శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘‘జనసేన అంటే కామ సేన, కామాంధుల సేన. మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలి. క్యారెక్టర్ లేని వాళ్లతో పాలిటిక్స్ చేస్తున్న హోం మంత్రిని సస్పెండ్ చేయాలి.’’ అని రోజా డిమాండ్ చేశారు.

Next Story