ఈసారి గోదావరి, కృష్ణా నీళ్లు వచ్చేలా లేవు: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-01 08:50:05  IST  )

భారత దేశంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీని వల్ల వర్షాలు తగ్గి కరవు పరిస్థితులు, వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు...

ఈసారి గోదావరి, కృష్ణా నీళ్లు వచ్చేలా లేవు: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశంపై ఎల్‌నినో(ELNINO) ప్రభావం తీవ్రంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీని వల్ల వర్షాలు తగ్గి కరవు పరిస్థితులు, వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రభావం దేశంతో పాటు ఏపీపైనా ప్రభావం చూపుతుందని చెప్పారు. గత సంవత్సరం జూన్ నెలలోనే ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయని, ఈ సంవత్సరం జులై అయినా నీళ్లు వచ్చే పరిస్థితి లేదని సీఎం చంద్రబాబు అంచనా వేశారు.

ఈసారి కష్టమే..

వర్షాలు లేక కృష్ణ, గోదావరి నుంచి నీళ్లు వచ్చేలా లేవన్నారు. గోదావరి, కావేరి అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నెల్లూరు పొన్నపువారి పాలెంలో ఆయన మాట్లాడుతూ యుద్ధం వల్ల నిత్యావసరాలన్ని ధరలు పెరిగాయని చెప్పారు. కష్టాలు వచ్చిన సమయంలో తెలివిగా వ్యవహరించాలని సూచించారు. దేశం నాకేమిచ్చిందని కాకుండా మనమేమి ఇచ్చామని ఆలోచించాలని చెప్పారు. తన లక్ష్యం అభివృద్ధి, సంక్షేమనని స్పష్టం చేశారు. మెరుగైన జీవన ప్రమాణాలను ప్రజలకు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

మీరు కూడా ఆ పార్టీని గొడ్డలిపార్టీ అనే పిలవండి: చంద్రబాబు

Next Story