- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వేధింపులు తట్టుకోలేకపోయా.. హద్దులు మీరడంతో తల పగలగొట్టా: కాయదు లోహర్
తాను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంటికి దగ్గరలోనే ఉన్న ట్యూషన్‌కు వెళ్లేదానినని కాయదు లోహర్ తెలిపారు.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కాయదు లోహర్ ‘ముఖిల్ పేట్టె’ మూవీతో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఇక తెలుగులో ‘అల్లురి’ మూవీ చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత చేసిన ‘డ్రాగన్’తో కాయదు రేంజ్ మారిపోయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో ఆమెకు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఫంకీ, పళ్లిచట్టంబి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె ప్రస్తుతం తెలుగులో నాని సరసన ‘ది ప్యారడైజ్’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే సూర్యతో నటించే చాన్స్ కూడా కొట్టేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కాగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. త్వరలోనే ‘ఇదాయం మురళి, ఇమ్మెర్టల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న కాయదు లోహర్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన 16 ఏళ్ల వయసులో జరిగిన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ షాకింగ్ విషయాలను పంచుకున్నారు. తాను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంటికి దగ్గరలోనే ఉన్న ట్యూషన్‌కు వెళ్లేదానినని కాయదు లోహర్ తెలిపారు.
ఆ సమయంలో ఒక కుర్రాడు తనను ఫాలో అవుతూ అసభ్యంగా ఈవ్ టీజింగ్ చేయడం మొదలుపెట్టాడని చెప్పారు. మొదట ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేసినప్పటికీ.. ఆ తర్వాత కూడా అతడు పదే పదే తన వెంటపడుతూ పూర్తిగా హద్దులు మీరి ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆకతాయి ప్రవర్తనతో తన కోపం కట్టలు తెంచుకుందని, దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని అతడిపైకి బలంగా విసిరానని వెల్లడించారు. ఆ రాయి బలంగా తగలడంతో ఆ కుర్రాడి తల బద్దలై రక్తం కారిందని, ఆ దెబ్బతో భయపడిపోయి అతడు అక్కడి నుండి పారిపోయాడని కాయదు చెప్పారు. తాను చూడటానికి చాలా సాఫ్ట్‌గా, సైలెంట్‌గా కనిపించినప్పటికీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం తనలోని అసలైన కోపం బయటకు వస్తుందని స్పష్టం చేశారు. ఆరోజు ఆ కుర్రాడు హద్దులు దాటి ప్రవర్తించాడు కాబట్టే తాను అంతలా ఎదురు తిరగాల్సి వచ్చిందని, ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా తనతో అలా ప్రవర్తిస్తే మాత్రం అవసరమైతే మళ్లీ మళ్లీ కొడతానంటూ కాయదు లోహర్ సమాధానమిచ్చారు.






