డయల్ 100 కు పదే పదే ఫోన్.. కట్ చేస్తే ఏడు రోజుల జైలు

by Taduka Kalyani |

రెండు రోజుల క్రితం మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు డయల్ 100 కు పదే పదే కాల్ చేసి న్యూసెన్స్ చేసిన కేసులో కోర్టు వారికి ఏడు రోజుల జైలు శిక్ష విధించింది.

డయల్ 100 కు పదే పదే ఫోన్.. కట్ చేస్తే  ఏడు రోజుల జైలు
X

దిశ, నిజామాబాద్ అర్బన్ : రెండు రోజుల క్రితం మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు డయల్ 100 కు పదే పదే కాల్ చేసి న్యూసెన్స్ చేసిన కేసులో కోర్టు వారికి ఏడు రోజుల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించినట్లు ఎస్ ఐ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్ కు చెందిన గంపల లక్ష్మణ్, సంపంగి బాలాజీలు మద్యం మత్తులో డయల్ 100 కు పదే పదే కాల్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లో వారిద్దరిపై కేసు నమోదైంది. వారిద్దరినీ నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్ ఐ తెలిపారు.

Next Story