- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST Collections: 14 శాతం పుంజుకున్న జీఎస్టీ వసూళ్లు
దేశీయ డిమాండ్, వినియోగం ఇంకా పూర్తిగా పుంజుకోలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: జూన్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. అయితే, ఈసారి వృద్ధికి దేశీయ వ్యాపార కార్యకలాపాలు కాకుండా దిగుమతులపై వచ్చిన పన్ను ఆదాయం మద్దతు కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు 13.9 శాతం పెరిగి రూ. రూ. 1,94,812 కోట్లకు చేరగా, రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ. 1.62 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన ఆదాయం 6.5 శాతం పెరిగి రూ. 1.35 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులపై వసూలైన జీఎస్టీ 34.6 శాతం ఎగిసి రూ. 60,038 కోట్లకు చేరింది. దేశీయ డిమాండ్, వినియోగం ఇంకా పూర్తిగా పుంజుకోలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో జూన్‌లో మొత్తం జీఎస్టీ రీఫండ్లు 29.1 శాతం పెరిగి రూ. 32,436 కోట్లకు చేరాయి. ఇందులో దేశీయ రీఫండ్లు 42.9 శాతం పెరిగి రూ. 17,767 కోట్లు, దిగుమతులకు సంబంధించిన రీఫండ్లు 15.6 శాతం పెరిగి రూ. 14,669 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే జీఎస్టీ వసూళ్లు వృద్ధి బాటలో ఉన్నప్పటికీ, ఆ వృద్ధిని ప్రస్తుతం దేశీయ ఆర్థిక కార్యకలాపాల కంటే దిగుమతులే ఎక్కువగా ముందుకు నడిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వసూళ్లు
జూన్ నెలలో తెలుగు రాష్ట్రాల జీఎస్టీ ఆదాయం చూస్తే, తెలంగాణలో 11 శాతం ఎక్కువగా రూ. 5,110 కోట్ల ఆదాయం నమోదవగా, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ. 3,548 కోట్లతో 5 శాతం మేర వృద్ధి నమోదైంది.






