ఎఫ్‌సీఆర్‌ఐలో బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

by Batti.Sumithra |

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ), ములుగులో 2026–27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

ఎఫ్‌సీఆర్‌ఐలో బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం
X

దిశ, ములుగు : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ), ములుగులో 2026–27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూలై 1 నుంచి 25 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంబైపీసీ లేదా ఎంపీసీ గ్రూపులతో ఉత్తీర్ణత సాధించి, టీజీ ఈఏపీసెట్–2026లో అర్హత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులో అటవీ సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ నిర్వహణ తదితర అంశాల్లో నాణ్యమైన శిక్షణ అందిస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి అటవీ శాఖ, పరిశోధనా సంస్థలు, పర్యావరణ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలు ఉంటాయని కళాశాల డీన్ ప్రవీణ తెలిపారు. అర్హులైన విద్యార్థులు జూలై 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

Next Story