- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న వయసులోనే పెద్ద సంకల్పం: 2.50 లక్షల సీడ్ బాల్స్ విసిరిన సిరిసిల్ల చిన్నారి
పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య స్ఫూర్తితో సిరిసిల్ల గురుకుల విద్యార్థిని బ్లెస్సీ పర్యావరణ రక్షకురాలిగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: వయసులో చిన్నదైనా ఆ చిన్నారి సంకల్పం మాత్రం కొండంత. పచ్చని ప్రకృతి కోసం పరితపించే వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకుని, పర్యావరణ పరిరక్షణనే తన శ్వాసగా మార్చుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఏడో తరగతి గురుకుల విద్యార్థిని బ్లెస్సీ. వివరాల్లోకి వెళితే.. తండ్రి ప్రకాష్ సహకారంతో బ్లెస్సీ కేవలం మూడో తరగతి చదువుతున్న సమయం నుంచే ఈ పర్యావరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి ఏకంగా 2.50 లక్షల విత్తన బంతులను (Seed Balls) తయారు చేసి వివిధ ఖాళీ ప్రదేశాలు, అటవీ ప్రాంతాలలో చల్లారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ వేళ బ్లెస్సీ మరో బిగ్ టార్గెట్‌ను పెట్టుకుంది. ఈసారి 15 వేల సీడ్ బాల్స్ స్వయంగా తయారు చేయడంతో పాటు, ప్రకృతిని పచ్చదనంతో నింపేందుకు 12 వేల మొక్కలను నాటాలని బ్లెస్సీ యోచిస్తోంది. చిన్న వయసులోనే ప్రకృతిపై చూపుతున్న ఆసక్తి, ప్రేమ పర్యావరణ ప్రేమికులను ముగ్ధులను చేస్తోంది.






