ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ : మంత్రి పొన్నం ప్రభాకర్

by Taduka Kalyani |

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, బాన్సువాడ: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గతంలోనూ నిర్వహించారని, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం కూడా ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ, ప్రస్తుతం అది బీజేపీకి అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు ఆర్టీసీని బలోపేతం చేసిందని తెలిపారు. ఎరువుల సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగినంత కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. యూరియా సరఫరా, పంపిణీపై కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నించాలని సూచించారు. రైతు భరోసా పథకం అమలు ప్రారంభమైందని, తొమ్మిది రోజుల్లో అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story