ప్యాషన్‌కు సరైన భాగస్వామ్యం తోడైతే మ్యాజిక్ తప్పదు.. అమీర్ లోగ్ పంపిణీ బాధ్యతలు తీసుకున్న స్టార్ హీరో

by Chukka Sudharani |

సరికొత్త కంటెంట్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది ‘అమీర్ లోగ్’.

ప్యాషన్‌కు సరైన భాగస్వామ్యం తోడైతే మ్యాజిక్ తప్పదు.. అమీర్ లోగ్ పంపిణీ బాధ్యతలు తీసుకున్న స్టార్ హీరో
X

దిశ, సినిమా: సరికొత్త కంటెంట్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది ‘అమీర్ లోగ్’. హైదరాబాద్ గల్లీ బ్యాక్ డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికర కథే ఈ చిత్రం. ఇందులో వారి స్నేహంతో పాటు నేటి యూత్‌కి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు రమణా రెడ్డి. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. అలాగే ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘అవ్వల్ దావత్’ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

ఈ క్రమంలోనే ఈ చిన్న చిత్రానికి అండగా టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి నిలిచాడు. ఆయన నేతృత్వంలోని ‘స్పిరిట్ మీడియా’ అమీర్ లోగ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుంది. ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో హారీ ఎత్తున విడుదల చేసేందుకు రానా టీమ్ సిద్ధమైంది. ఈ సినిమాలో కామెడీతో పాటు ఆకట్టుకునే కంటెంట్ ఉండటంతో దీనిని ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చేందుకు స్పరిట్ మీడియా ముందుకు రాగా.. త్వరలోనే రిలీజ్‌పై అప్డేట్ ఇవ్వనుంది. కాగా.. ఈ చిత్రంలో ఎంసీహరి, మనోజ్, శశిధర్ హీరోలుగా, వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story