- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిషేక్ శర్మ సరికొత్త రికార్డ్..ఒంటి చేత్తో 100 సిక్సులు
టీ20లలో 20 లేదా అంత కంటే తక్కువ బంతుల్లో ఐదు అర్థ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు అభిషేక్ శర్మ.

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్, భారత్ మధ్య కాసేపటి క్రితమే టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది భారత్. మొదటి టీ20 లో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్, భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ అర్థ సెంచరీతో దుమ్ము లేపాడు. 20 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఐదు బౌండరీలతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు అభిషేక్ శర్మ. టీ20లలో 20 లేదా అంత కంటే తక్కువ బంతుల్లో ఐదు అర్థ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. అదే సమయంలో అంతర్జాతీయ టీ20లలో 100 సిక్సర్లు కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో మళ్లీ అభిషేక్ శర్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. కాగా ఈ మ్యాచ్ లో 59 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు అభిషేక్ శర్మ. 14 ఓవర్లు ఆడిన భారత్ ఇప్పటికే 120కి పైగా పరుగులు సాధించింది.






