IND Vs ENG: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

by Kema Shiva Kumar |

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు వైపు పయనిస్తోంది.

IND Vs ENG: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ సంజు శాంసన్ (1), ఇషాన్ కిషన్ (0) పరుగులకే వెనుదిరగడంతో భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే మరో ఎండ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. అతడికి తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (27 పరుగులు, 17 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ప్రస్తుతం భారత్ 8.2 ఓవర్లలో 3 కీలక వికెట్లు కోల్పోయి 88 పరుగుల చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, సామ్ కరన్‌లకు చెరో వికెట్ దక్కింది.

Next Story