70 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిసె కూల్చివేత

by Batti.Sumithra |

మెదక్ మండలం మాచారం గ్రామంలో సుమారు 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ గుడిసెను కూల్చివేయడం పై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

70 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిసె కూల్చివేత
X

దిశ, మెదక్ టౌన్ : మెదక్ మండలం మాచారం గ్రామంలో సుమారు 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ గుడిసెను కూల్చివేయడం పై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అసెస్‌మెంట్ నంబర్–650తో ఉన్న ఈ ప్రభుత్వ గుడిసెను గతంలో గ్రామ కచేరీగా ఉపయోగించేవారని, అనంతరం గ్రామ ప్రజలు బస్‌స్టాండ్‌ గా వినియోగించుకున్నారని తెలిపారు. గ్రామచరిత్రకు, సామాజిక అవసరాలకు ప్రతీకగా నిలిచిన ఈ ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ గుడిసెతో తమ చిన్ననాటి జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని, దానిని కూల్చివేయడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసె ధ్వంసం పై గతంలోనే పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీంతో గ్రామస్తులంతా కలిసి పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ధ్వంసమైన ప్రభుత్వ గుడిసెను యథాతథంగా పునర్నిర్మించడంతో పాటు ఈ ఘటనకు బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story