Vodafone Idea: వొడాఫోన్ ఐడియా నుంచి కొత్త వార్షిక ప్లాన్

by S Gopi |

ఆ పరిమితి ముగిసిన తర్వాత డేటా వేగం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్లాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వొడాఫోన్ ఐడియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా నుంచి కొత్త వార్షిక ప్లాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొత్తగా రూ.4,600 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఏడాది (365 రోజులు) వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 5జీ సపోర్ట్‌తో డేటా సదుపాయం అందిస్తోంది. కంపెనీ దీనిని 'అన్‌లిమిటెడ్ డేటా' ప్లాన్‌గా ప్రచారం చేస్తున్నప్పటికీ, ప్రతి 28 రోజులకు 300జీబీ ఫెయిర్ యూసేజ్ పాలసీ (ఎఫ్‌యూపీ) పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ముగిసిన తర్వాత డేటా వేగం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్లాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వొడాఫోన్ ఐడియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 4జీ, 5జీ వినియోగదారులకు ఒకేలా వర్తిస్తుంది. అంటే నెట్‌వర్క్ ఏదైనా డేటా పరిమితిలో ఎలాంటి తేడా ఉండదు. మొత్తం ఖర్చును లెక్కిస్తే రోజుకు సగటున రూ.12.60 మాత్రమే అవుతుంది. దీర్ఘకాలం రీఛార్జ్ గురించి ఆలోచించకుండా ఉండాలనుకునే, ఎక్కువ డేటా వినియోగించే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు చెబుతోంది. ఇదే సమయంలో రూ.2,475 ధరలో మరో కొత్త వార్షిక ప్లాన్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం రంగంలో వార్షిక ప్లాన్‌లకు డిమాండ్ పెరుగుతున్న వేళ, ఎక్కువ డేటా ప్రయోజనాలతో కంపెనీ తీసుకొచ్చిన ఈ ప్లాన్ మార్కెట్లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది.

Next Story