- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ అభిమానుల ఓట్ల చోరీ అడ్డుకోవాలి.. మంత్రి గడ్డం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

దిశ, రామచంద్రాపురం : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రామచంద్రాపురంలోని బాలాజీ గార్డెన్స్‌లో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్ఏలకు ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తుల వినియోగం, 2002 ఓటర్ల డేటా మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణలో అనుసరించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాల పై మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా, ఎలాంటి లోపాలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
డివిజన్‌ల వారీగా బీఎల్ఏలతో మాట్లాడి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి ఓటరు సవరణ ఫారాలను ఎలా నింపాలో వివరించారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ బీఎల్‌ఓల పనితీరును పర్యవేక్షిస్తూ బాధ్యతగా పనిచేయాలని బీఎల్ఏలకు సూచించారు. మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలని, ఇందులో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రజల్లో కూడా ఈ ప్రక్రియ పై విస్తృత ప్రచారం నిర్వహించి, తమ ఓటు వివరాలను సరిచూసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
ఈ అవగాహన సదస్సులో ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తుల పరిశీలన తదితర సాంకేతిక అంశాలపై ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, దొంగ ఓట్ల తొలగింపుకు పటాన్‌చెరులో ఎస్‌ఐఆర్ కార్యక్రమం ఎంతో అవసరమన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కోఆర్డినేటర్ వెన్నెల, డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.






