- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహసీల్దార్ కార్యాలయంలో నాగుపాము కలకలం
by Ratna Kumari |
బయ్యారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నాగుపాము ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

X
దిశ, బయ్యారం : బయ్యారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నాగుపాము ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో కార్యాలయంలోకి నాగుపాము రావడంతో విధుల్లో ఉన్న తహసీల్దార్ నాగరాజు, కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని నాగుపామును చంపివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
Next Story






