- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎంహెచ్‌వో వేధిస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆరోపణ
by Ratna Kumari |
హనుమకొండ జిల్లాకు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్‌వో తమను మానసికంగా వేధిస్తున్నారని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులతో ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఆరోపించారు.

X
దిశ, హనుమకొండ కలెక్టరేట్ : హనుమకొండ జిల్లాకు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డీఎంహెచ్‌వో తమను మానసికంగా వేధిస్తున్నారని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులతో ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఉద్యోగులు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ డీఎంహెచ్‌వో వ్యవహారశైలిపై ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల ఫిర్యాదులపై స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడి విషయం వివరించినట్లు తెలిపారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై డీఎంహెచ్‌వోపై శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు వెల్లడించారు.
Next Story






