మరోసారి రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్!

by Chukka Sudharani |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

మరోసారి రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌తో అలరించింది. అలాగే మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బెస్ట్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక పెద్ది అనంతరం రామ్ చరణ్ తన తన RC17 కోసం సిద్ధం అవుతున్నాడు. దీనికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వస్తోన్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చరణ్ RC18కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది.

చరణ్ తన 18వ సినిమా కోసం మరోసారి బుచ్చిబాబుతో చేతులు కలిపినట్లు ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా.. రామ్ చరణ్ సపోర్ట్‌తో దర్శకుడు బుచ్చిబాబుకు నిర్మాత నుంచి అడ్వాన్స్ అందినట్లు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఈ వారంలోనే కొత్త ఆఫీస్ ప్రారంభం కానుండగా, సుకుమార్ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC18 సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బుచ్చిబాబు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు వేగవంతం చేసినట్లు కూడా పోస్టులు వైరల్ అవుతుండగా.. దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.

Next Story