ఎనర్జీ డ్రింక్స్ బ్రాండ్లకు FSSAI షాక్.. ‘ఎనర్జీ బూస్టర్’ ప్రకటనలపై నిషేధం

by Kema Shiva Kumar |

మార్కెట్లోని ఎనర్జీ డ్రింక్స్ ప్రకటనలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) కఠిన నిబంధనలు విధించింది.

ఎనర్జీ డ్రింక్స్ బ్రాండ్లకు FSSAI షాక్.. ‘ఎనర్జీ బూస్టర్’ ప్రకటనలపై నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: బహిరంగ మార్కెట్లలో లభ్యమయ్యే ఎనర్జీ డ్రింక్స్ (Energy Drinks), వాటి ప్యాకేజింగ్‌పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ‘ఎనర్జీ డ్రింక్’, అలాంటి ఇతర ఉత్పత్తులకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎలాంటి ప్రత్యేక ప్రమాణాలను (Standards) నోటిఫై చేయలేదని స్పష్టం చేసింది. ఆహార భద్రత ప్రమాణాల నిబంధనల పరిధిలోని ఫుడ్ కేటగిరీ సిస్టమ్ అనేది ఉత్పత్తుల పేర్లు, లేబ్లింగ్ ప్రయోజనాల కోసం ఉద్దేశించినది కాదని పేర్కొంది.

ఈ క్రమంలోనే ఆ కేటగిరీల ఆధారంగా బ్రాండ్ల లేబ్లింగ్ కూడా ఇక మీదట ఉండకూడదని FSSAI తెలిపింది. అదేవిధంగా ఆహార ఉత్పత్తులపై వినియోగదారులను ఆకర్షించేలా చేసే కొన్ని రకాల ప్రకటనలను FSSAI పూర్తిగా నిషేధించింది. ముఖ్యంగా ‘శరీరానికి, మనస్సుకు ఉత్తేజాన్ని ఇస్తుంది’, ఏకాగ్రతను పెంచుతుంది, సాధారణ బలహీనత నివారణకు తోడ్పడుతుంది.. అంటూ పదాలను యాడ్స్‌లో వాడేందుకు వీలు దేదని తేల్చిచెప్పింది. ఇక నుంచి నిబంధనల ప్రకారం.. ఆహార ఉత్పత్తులపై ఇలాంటి తప్పుదోవ పట్టించే నిబంధనలను, ప్రకటనలను అనుమతించేది లేదని, ఒకవేళ అతీక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని FSSAI వార్నింగ్ ఇచ్చింది.

Next Story