- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండలింగంపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు
by Ratna Kumari |
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి పోచమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.

X
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి పోచమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మాదిగ సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఇంటికో బోనం ఎత్తుకుని గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతలకు మొక్కులు చెల్లించారు. బోనాల ఊరేగింపులో శివసత్తుల శిగాలు, బైండ్లవారి గాండ్రింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను అలరించాయి. గ్రామదేవతలైన పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ అమ్మవార్ల ఉత్సవాల్లో భాగంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలరాజ్ నర్సాగౌడ్, ఉపసర్పంచ్ తెడ్డు రాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story






