- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల జీవితాల్లో మార్పే మా ఎజెండా.. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
ఆడబిడ్డగా పార్టీ పెట్టి జెండా ఎత్తానని.. పేదల జీవితాల్లో మార్పే ఎజెండాగా పెట్టుకున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆడబిడ్డగా పార్టీ పెట్టి జెండా ఎత్తానని.. పేదల జీవితాల్లో మార్పే ఎజెండాగా పెట్టుకున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు. బుధవారం సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వస్తే అందరి జీవితాలు మారిపోతాయని భావించామని.. దురదృష్టవశాత్తు అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పేదలు, మధ్యతరగతి జీవితాలు మారేలా పరిపాలన సాగిస్తామని.. వారికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎజెండా మారాల్సిన అవసరమున్నదని.. పెద్దవాళ్ల కోసం కాకుండా పేదవాళ్ల బతుకులు మారేలా పార్టీల ఆలోచన విధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు ఉండగా కొత్త పార్టీ అవసరం ఏంటని చాలా మంది అనుకుంటున్నారని.. కానీ ఆయా పార్టీలు అసలు పేదల గురించి ఆలోచన చేయడం లేదని చెప్పారు.
ప్రజల కష్టాలు తెలిసిన ఆడబిడ్డగా..
ప్రజల కష్టాలు తెలిసిన ఆడబిడ్డగా వారి జీవితాల్లో మార్పు రావాలన్న గట్టి సంకల్పంతోనే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని ఆయన చెబుతుండటం చూస్తుంటే నవ్వు వస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా, ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఎట్లా గెలుస్తావ్ అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా గురువారం ఉప్పల్ భగాయత్ లో పెద్ద ఎత్తున భూ పోరాటం చేస్తామన్నారు.
హార్డ్ వర్క్‌నే నమ్ముకోండి
సక్సెస్‌కు షార్ట్ కట్ లేదని హార్డ్ వర్క్‌నే నమ్ముకోవాలని కవిత యువతకు సూచించారు. మెహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. 1,500 కంపెనీలతో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా జాబ్ మేళా ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. యువత ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పవద్దని.. తెలియనిది తెలియదనే చెప్పాలన్నారు. యూఎస్‌లో తన మొదటి జాబ్ ఎక్స్ పీరియన్స్‌ను ఈ సందర్భంగా కవిత షేర్ చేసుకున్నారు. 2001లో యూఎస్ లో జాబ్ కోసం వెళ్లిన ఇంటర్వ్యూలో తనకు తెలియని విషయాలను తెలియదని.. కాస్త టైమ్ ఇస్తే స్కిల్స్ నేర్చుకుంటానని చెప్పినట్లు గుర్తు చేశారు.






