- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ ‘యూజర్ నేమ్స్’ ఫీచర్‌పై కేంద్రం బ్రేక్.. మెటా సంస్థకు నోటీసులు జారీ!
వాట్సాప్ తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై తాజాగా కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ (Usernames) ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే (Impersonation) ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో, వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ (Meta Platforms)కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది.
మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి..
అయితే, వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ను రోల్ అవుట్ చేయడం వెనుక ఉన్న పూర్తి వివరాలు, తగిన భద్రతా ప్రమాణాలపై మూడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్రం మెటాను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులు, సమీక్షలు పూర్తయ్యే వరకు భారతదేశంలోని వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, వాట్సాప్‌లో ఫోన్ నంబర్ కనిపించకుండా కేవలం యూజర్ నేమ్స్ ద్వారా చాట్ చేసుకునేందుకు మెటా ఈ ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. దీంతో సైబర్ నేరాలు, నకిలీ అకౌంట్ల ద్వారా మోసాలు పెరిగే అవకాశం ఉందన్న భయాల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది.






