HMRL:హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి పదవీ బాధ్యతలు

by Ramesh Naini |

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా బి.అజిత్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

HMRL:హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి పదవీ బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా బి.అజిత్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రసూల్ పురాలోని మెట్రో రైల్ భవన్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. హెచ్ఎంఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎండీ అజిత్ రెడ్డి హెచ్ఎంఆర్ఎల్ ఉన్నతాధికారులతో ఫేజ్ -1, ఫేజ్-2 తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొత్త అదనపు ఎండీ అజిత్ రెడ్డి ని కలిసిన వారిలో హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద మోహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్ధన్ రెడ్డి, డి.సూర్యప్రకాశం, శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ వై.సాయపరెడ్డి ఉన్నారు.

Next Story