- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. రెండు అవగాహన ఒప్పందాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, వృత్తి విద్యా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అధ్యాపకులకు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఇంటర్ బోర్డు రెండు కీలక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, వృత్తి విద్యా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అధ్యాపకులకు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఇంటర్ బోర్డు రెండు కీలక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో రేడియంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్ఐటీ), ప్రముఖ ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రతినిధులతో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, ప్రభుత్వ వృత్తి విద్యా కాలేజీల లెక్చరర్లకు ఆర్‌ఐటీ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. అలాగే, విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈటీ, ఈసీటీ, ఎంఈ విభాగాల విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ అందించనున్నారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ మాట్లాడుతూ పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి, విద్యార్థులను ఉద్యోగాలకు సిద్దం చేయడానికి ఈ ఒప్పందం ఎంతో కీలకమైందన్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అధ్యాపకులు, విద్యార్థులు లబ్ధి పొందుతారని తెలిపారు.
ఎంఎస్ఎన్ ల్యాబ్స్‌తో ఇంటర్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు
మరో ప్రధాన ఒప్పందంలో భాగంగా, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఫార్మా రంగంలో విస్తృత కెరీర్ అవకాశాలను కల్పించేందుకు ఎంఎస్ఎన్ (ఎంఎస్ఎన్) ల్యాబొరేటరీస్ ముందుకు వచ్చింది. 2023 నుండి 2026 విద్యా సంవత్సరాల మధ్య ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్టీ, ఫార్మా టెక్నాలజీ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులను ఈ సంస్థ నేరుగా రిక్రూట్ చేసుకోనుంది. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ హ్యూమన్ రీసోర్సెస్ వైస్ ప్రెసిడెంట్ కెఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ యువతలోని ప్రతిభను ప్రోత్సహించడం, వారు విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకునేలా అవకాశాలు సృష్టించడం తమ బాధ్యత అన్నారు. ఇంటర్మీడియట్ విద్యామండలితో తమ భాగస్వామ్యం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఫార్మాస్యూటికల్ రంగానికి వారి వంతు సహకారాన్ని అందించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు






