- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత కీలకం : ఎమ్మెల్యే చింత ప్రభాకర్
జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా సదాశివపేట పట్టణంలోని శ్రీ ఆద్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మాస్టర్ హెల్త్ చెక్-అప్ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దిశ, సదాశివపేట : జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా సదాశివపేట పట్టణంలోని శ్రీ ఆద్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మాస్టర్ హెల్త్ చెక్-అప్ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అంకితభావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు.
తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ రోగుల ఆరోగ్యమే లక్ష్యంగా సేవ చేస్తున్న ప్రతివైద్యుడు సమాజానికి నిజమైన సేవకుడని పేర్కొన్నారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో, ఆరోగ్యం పై అవగాహన కల్పించడంలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడంలో వైద్యుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా డాక్టర్లకు రవీంద్రనాథ్, అభినవ్, హరీష్ రెడ్డిలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింత గోపాల్, చీల మల్లన్న, మొబీన్, సుధీర్ రెడ్డి , డాకూర్ అశోక్ గౌడ్, చిన్నాకర్ హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






