- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, మానకొండూరు : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు గురువారం ఉదయం మానకొండూరు మండలంలోని లింగాపూర్, తెనుగుపల్లి గ్రామాల పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు భారీ ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేశారు.
ఈ డంపుల నుంచి సుమారు 115 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుకను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. జిల్లాలో ఇసుక మాఫియాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మైనింగ్ చట్టాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






