- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది పూర్తిగా ఒక కల్పిత కథ మాత్రమే.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు.. అఖిల్ కామెంట్స్ వైరల్
అక్కినేని అఖిల్ త్వరలో ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాడు.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ త్వరలో ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాడు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత భారీ అంచనాల మధ్య ఈ మూవీ జులై 10న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన టీమ్ వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ సినిమా విశేషాలు పంచుకున్నాడు. ‘లెనిన్’ అనే పేరు వినగానే ఇది రాజకీయ నేపథ్యమున్న సినిమానో, లేదా కమ్యూనిజం సిద్ధాంతాల గురించిన కథో అని నెట్టింట ప్రచారం జరగగా.. దీనిపై అఖిల్ క్లారిటీ ఇస్తూ..
‘లెనిన్ టైటిల్‌కు ఎలాంటి పొలిటికల్ కనెక్టివిటీ లేదు. ఇది పూర్తిగా ఒక కల్పిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. దర్శకుడు నందుకు ఈ పేరు పట్ల ఉన్న ప్రత్యేక ఇష్టం, గౌరవంతోనే ఈ టైటిల్‌ను ఎంచుకున్నారు. కథ ప్రకారం సమాజంలో ఒక బలమైన శక్తిగా ఎదిగి, సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలతో ప్రజలను నడిపించే ఒక పవర్‌ఫుల్ కుర్రాడి పాత్రకు ఈ పేరు సరిపోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. లెనిన్ కేవలం కమ్యూనిజానికి మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన లీడర్‌షిప్‌కు ప్రతీకగా నిలుస్తుందని దీని అర్థం’ అని చెప్పుకొచ్చారు.






