- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్‌మీడియా దుర్వినియోగంపై పవన్ ఆగ్రహం: ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
సోషల్ మీడియాలో ఇటీవల కాలం కొందరి కామెంట్స్ శృతి మించుతున్నాయి. వ్యక్తిగత హనానికి పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయకుండా బూతులు మాట్లాడుతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఇటీవల కాలం కొందరి కామెంట్స్ శృతి మించుతున్నాయి. వ్యక్తిగత హనానికి పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయకుండా బూతులు మాట్లాడుతున్నారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆఫీసులో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తీసుకోబోయే చర్యలపైనా ఆయన వివరించారు. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై బీఎన్ఎస్ చట్టాల ప్రకారం శిక్షిస్తామన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అర్థం వ్యక్తిహననం కాదని చెప్పారు. ప్రజా స్వామ్యాన్ని ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించమని తెలిపారు. మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదన్నారు. దేవుళ్లు, దేవతలపైనా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శలు నిర్మాణాత్వకంగా ఉండాలని, కాదని శృతి మించితే శిక్ష తప్పదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
అలా చేయడం సమంజసం కాదు
సైబర్ వేధింపులు, పరువు ప్రతిష్టలు తీయాలనుకోవడం సమంజసం కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేరస్తులకు, నేరాలకు కులం, మతం లేదని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులు పడుతున్న వారికి అండగా ఉంటామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అలాగే చట్టాలను మరింత పటిష్టం చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం.సైబర్ నేరాలపై త్వరగా యాక్షన్ ఉంటుంది. చట్టవిరుద్ధమైన కంటెంట్ షేర్ చేయొద్దు.’’ అని పవన్ కల్యాణ్ సూచించారు.






