- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ మీడియా అక్రెడిటేషన్ కార్డు.. పోలీసులకు ఫిర్యాదు
సామజిక మాధ్యమాల్లో పి. శ్రీనివాస్ అనే వ్యక్తి పేరుతో నకిలీ మీడియా అక్రిడిటేషన్ కార్డు చలామణి అవుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పౌర సంబంధాల అధికారిణి ఎన్. పద్మశ్రీ తెలిపారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జూలై 01: వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో పి. శ్రీనివాస్ అనే వ్యక్తి పేరుతో నకిలీ మీడియా అక్రిడిటేషన్ కార్డు చలామణి అవుతున్న నేపథ్యంలో, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్. పద్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కార్డు సమాచార పౌర సంబంధాల శాఖ, నిజామాబాద్ జిల్లా కార్యాలయం నుండి జారీ చేయబడలేదని ఆమె స్పష్టం చేశారు. సదరు వ్యక్తి జిల్లా కలెక్టర్ ఫోర్జరీ సంతకంతో నకిలీ కార్డును తయారు చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్న అధికారిణి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని అన్నారు. ఎవరైనా ఈ తరహాలో నకిలీ, బోగస్ అక్రిడిటేషన్ కార్డులు తయారు చేయండి, వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారిణి పద్మశ్రీ తెలిపారు.






