- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూసుకొచ్చిన బస్సు.. విద్యార్థి మృతి
కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్న విద్యార్థిపైకి ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

దిశ, చేవెళ్ల : కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్న విద్యార్థిపైకి ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. చేవెళ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని కందవాడ గ్రామానికి చెందిన శేరి కృష్ణారెడ్డి కుమారుడు సాత్విక్ రెడ్డి మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని స్వామి నారాయణ్ గురుకుల్‌లో ఇంటర్ చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే తన స్వగ్రామమైన కందవాడ నుంచి కళాశాలకు వెళ్లేందుకు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని షాబాద్ చౌరస్తా వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా ఉదయం తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సాత్విక్ రెడ్డి మీదికి దూసుకెళ్లింది, అలాగే పక్కనే ఉన్న ఆల్టో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాత్విక్ రెడ్డికి తల, శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆల్టో కారు ఎడమవైపు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాద ఘటన పై మృతుడి తండ్రి శేరి కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి కుమారుడు, ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






