గౌర ఏరోస్పేస్ కంపెనీలో అగ్నిప్రమాదం..

by Batti.Sumithra |

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర ఏరోస్పేస్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

గౌర ఏరోస్పేస్ కంపెనీలో అగ్నిప్రమాదం..
X

దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర ఏరోస్పేస్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో కంపెనీకి కొంత మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన పై ఆదిభట్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా లేదా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story