- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ షెడ్డును సీజ్ చేసిన అధికారులు
by Batti.Sumithra |
మియాపూర్ హఫీజ్‌పేట్‌లో అక్రమంగా నిర్మించిన భారీ షెడ్డును మియాపూర్ సీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు.

X
దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్ హఫీజ్‌పేట్‌లో అక్రమంగా నిర్మించిన భారీ షెడ్డును మియాపూర్ సీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్పందించిన మియాపూర్ సర్కిల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, దాదాపు 3,000 గజాల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ షెడ్డును సీజ్ చేసి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సీజ్ చేసిన షెడ్డును తిరిగి తెరవకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి కోరారు. అధికారులు సీజ్ చేసిన నిర్మాణాలను అనంతరం నిర్మాణదారులు సీజ్ తొలగించి తమ అవసరాలకు వినియోగించుకోవడం సరైన విధానం కాదని ఆయన అన్నారు. ఇలా చేయడం వల్ల సీజ్ ప్రక్రియ అపహాస్యం పాలవుతుందని పేర్కొన్నారు.
Next Story






